కారు స్టార్ట్‌ చేస్తానంటూ సాయం..ఉడాయింపు


హైదరాబాద్‌: ఆగిపోయిన కారును స్టార్ట్‌ చేస్తానంటూ కారుతో ఉడాయించిన సంఘటన ఎల్‌బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.



వివరాలివీ.. మన్సూరాబాద్‌కు చెందిన ప్రవీణ్‌బాబు ఈ నెల 17వ తేదీన రాత్రి 11.45 గంటల సమయంలో ఉప్పల్‌ నుంచి మన్సూరాబాద్‌ వైపు వస్తున్నాడు. నాగోలు బ్రిడ్జి సమీపంలో ఆయన కారు ఆగిపోయింది. ఆ సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ‘మీరు కారును వెనక నుంచి నెట్టండి నేను స్టార్ట్‌ చేస్తా’నంటూ చెప్పగా ప్రవీణ్‌బాబు నమ్మాడు. ఆ వ్యక్తి డ్రైవింగ్‌ సీట్‌లో కూర్చోగా ప్రవీణ్‌బాబు కారును ముందుకు నెట్టాడు. కొంత దూరం తోయగా కారు స్టార్ట్‌ అయింది. అయితే, ఆ అగంతకుడు స్టార్ట్‌ అయిన కారుతో ఉడాయించాడు.  దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top