అవగాహనతో ముందుకు..


జీఎస్టీ అమలు కోసం సంయుక్త సమావేశంలో నిర్ణయం



సాక్షి, హైదరాబాద్‌: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమలు కోసం అవగాహనతో ముందుకెళ్లాలని, పన్ను వసూలు బాధ్యతను చెరిసగం పంచుకోవాల్సి ఉన్నందున సమన్వయంతో పనిచేయాలని సెంట్రల్‌ ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు నిర్ణయించారు. గురువారం ఫ్యాప్సీలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అధ్యక్షతన ఇరు శాఖల ఉన్నతస్థాయి అధికారుల సమావేశం జరిగింది.



డీలర్ల రిజిస్ట్రేషన్లు, రిటరŠన్స్‌ ఫైలింగ్, ఫైళ్ల పర్యవేక్షణ, కాల్‌సెంటర్లపై ఇరు శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు. డివిజన్‌ స్థాయిలో ప్రతి రెండో, నాలుగో బుధవారాల్లో 2 శాఖల అధికారులు సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. సమావేశంలో సెంట్రల్‌ ఎౖMð్సజ్‌ ప్రిన్సిపల్‌ కమిషనర్‌ నరేశ్, చీఫ్‌ కమిషనర్‌ బీబీ అగర్వాల్‌తో పాటు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top