కూకట్‌పల్లి కెనరా బ్యాంక్‌లో స్వల్ప అగ్నిప్రమాదం


హైదరాబాద్‌: కూకట్‌పల్లి ప్రగతి నగర్‌లోని ఓ బ్యాంక్‌లో ఆదివారం సాయంత్రం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. కెనరా బ్యాంక్‌లో మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.



సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలికి చేరుకుని మంటాలను అదుపులోకి తెచ్చినట్టు తెలిసింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top