సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం

సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం - Sakshi


సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత క్యాచీ ఫర్నీచర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు అందించిన సమాచారంతో  అగ్నిమాకప శాఖకు చెందిన ఫైరింజన్లు సంఘటనాస్థలానికి వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి.


 


ఈలోపు దుకాణంలోపల అగ్నికీలలు మరింత ఎగిసిపడటంతో మరికొన్ని ఫైరింజన్లను తెప్పించారు. మొత్తం 8 ఫైరింజన్లతో గంటలపాటు కష్టపడిన తర్వాతగానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో షాపులోని దగ్ధమైన వస్తువుల విలువ లక్షల్లో ఉంటుందని అంచనా. కాగా ఎవరికి గాయాలైనట్లు సమాచారంలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఫర్నీచర్ షాపులో మంటలు చెలరేగినట్లు తెలిసింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top