ఏపీ డీఎస్సీ-2014 అక్రమాలపై విచారణ


హైదరాబాద్: ఏపీ డీఎస్సీ-2014లో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ చేయడానికి రిటైర్డ్ ఐఏఎస్ బాలసుబ్రహ్మణ్యం అధ్యక్షతన పాఠశాల విద్య రీజనల్ జాయింట్ డెరైక్టర్ వీఎస్ భార్గవ సభ్యులుగా ద్విసభ్య కమిటీని ప్రభుత్వం నియమించింది. నెల రోజుల్లో గా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్య శాఖ కార్యదర్శి ఆర్‌పీ సిసోడి యా శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.



డీఎ స్సీ-2014 ప్రశ్నపత్రాల రూపకల్పనపైనా, ఫైనల్ ఆన్సర్ కీ రూపొందించడంపైనా అభ్యర్థుల నుంచి ఫిర్యాదులొచ్చాయి. ప్రధానంగా ప్రశ్న పత్రాలను రూపొందించడంలోనూ ఫైన ల్ కీని తయారీలోనూ నిర్లక్ష్యంగా  వ్యవహరిం చడమే అక్రమాలకు కారణమని ప్రభుత్వం ని ర్ధారణకు వచ్చింది. దీనిపై సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులను గుర్తించడం కోసం ద్విసభ్య కమిటీని నియమించింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top