బీజేపీలో ఆధిపత్య పోరు!

బీజేపీలో ఆధిపత్య పోరు! - Sakshi


పార్టీపై పట్టు చాటేందుకు పోటాపోటీగా కార్యక్రమాలు

పార్టీ కార్యక్రమాల్లో కె. లక్ష్మణ్‌

బొగ్గుబావుల పర్యటన పేరిట కిషన్‌రెడ్డి ప్రయత్నాలు  




సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బీజేపీలో ఆధిపత్య పోరు ఊపందుకుంటోంది. రెండేళ్లలో సార్వ త్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీపై  పట్టు చాటుకునేందుకు, ముఖ్య నేతలు ప్రయత్నిస్తున్నారు. తమ వర్గాలను పెంచు కోవడానికి, పార్టీ జిల్లా నేతలను తమవైపు తిప్పుకోవడానికి యత్నిస్తున్నారు. మొత్తంగా పార్టీపై ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవ హరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ దిశగా పలు ప్రజా సమస్యలపై మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఆందోళనలు చేసేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు.



ఇందులో భాగంగా రైతు సమస్యలపై వివిధ జిల్లాల్లో కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు పార్టీ శాసనసభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి ఈ నెల 20 నుంచి 23 వరకు సింగరేణి పరిధిలోని వివిధ జిల్లాల్లో బొగ్గుబావుల పర్యటన చేపడు తున్నారు. ఇంకోవైపు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తన శాఖ తరఫున, ఇతరత్రా కార్యక్రమాలను చేపడుతూ తరచూ హైదరా బాద్‌తోపాటు వివిధ జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు కూడా తరచూ రాష్ట్రంలో పలు కార్యక్రమాలను చేపడుతూ గుర్తింపు చాటుకుంటున్నారు. ఇలా రాష్ట్ర పార్టీ 4 ధృవా లుగా ఉండటంతో... జిల్లాల వారీగా నాయ కులు, కేడర్‌లోనూ విభజన కనిపిస్తోందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.



సీఎం అభ్యర్థి ఎవరు?

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే  పరిస్థితులున్నాయంటూ పార్టీ జాతీయ నాయకత్వం సంకేతాలిచ్చిన నేపథ్యం లో... ముఖ్య నేతలు ఎవరికి వారు తమ ఆధిపత్యాన్ని చాటేయత్నం చేస్తున్నారు. ఇక రాబోయే మూడు నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో నలభై యాభై మంది వరకు పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి లను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలో తెలంగాణ, ఏపీ, ఒడిశా, తమిళనాడులపై దృష్టిని కేంద్రీ కరించనుందనే సంకేతాలున్నాయి. పార్టీపరంగా ముందుగానే సీఎం అభ్య ర్థిని ప్రకటించాలని జాతీయ నాయ కత్వం భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో రాష్ట్రంలో ముఖ్య నేతలంతా తమ వర్గాన్ని తయారు చేసుకునే పనిలో పడ్డారనే ప్రచారం సాగుతోంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top