ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ సెంటర్లు..


హైదబాబాద్ః తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ కేంద్రాలు ప్రారంభిస్తున్నారు. ఐటీ సంస్థ.. 'సయంట్ డిజిటల్ సెంటర్స్' (సీడీసీ) ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా సేరిలింగంపల్లి మండలంలోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో  డిజిటల్ కేంద్రాలను ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. సీఎస్ఆర్ ఇనీషియేటివ్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు సంస్థ వెల్లడించింది.



సయంట్ డిజిటల్ సెంటర్లలో కంప్యూటర్ లేబొరేటరీ, డిజిటల్ లైబ్రరీ, నేషనల్ డిజిటల్ అక్షరాస్యత మిషన్లు పనిచేస్తాయని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. సంఘ సభ్యులకు,  పేద విద్యార్థులకు డిజిటల్ విద్యా వనరులను అందించడమే లక్ష్యంగా ఈ సీడీసీ లు కృషి చేస్తాయని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల్లో ఏర్పాటు చేస్తున్న కేంద్రాల్లో సుమారు 20,000 మంది పేద విద్యార్థులకు ప్రత్యేక డిజిటల్ సేవలు అందించనున్నట్లు సంస్థ తెలిపింది. ప్రతి సెంటర్ నుంచి ఓ కంప్యూటర్ లేదా డిజిటల్ యాక్సెస్ పరికరం వినియోగిస్తూ.. ఇంటర్నెట్ ఉపయోగించడం ద్వారా పరిసర ప్రాంతాల్లోని 1000 మందికి కమ్యూనిటీ సభ్యులు శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ప్రత్యేక కార్యక్రమంతో 16 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సున్న మొత్తం 50,000 మంది వరకూ  ప్రయోజనం పొందే అవకాశం ఉన్నట్లు సంస్థ  ప్రకటించింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top