నిర్లక్ష్యం తీసిన ప్రాణం..

నిర్లక్ష్యం తీసిన ప్రాణం..


మట్టిపెళ్లలు పడి కూలీ మృతి   

ఎంఎంటీఎస్ ఆర్‌యూబీ నిర్మాణంలో దుర్ఘటన


సాక్షి, హైదరాబాద్: రైల్వే అధికారుల పర్య వేక్షణ లోపం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలి తీసుకుంది. పొట్ట చేత పట్టుకుని నగరానికి వచ్చిన కూలీ బతుకు తెల్లారిపోయింది. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా రైల్ అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ) కోసం తవ్విన పెద్ద గుంతలో మట్టి పెళ్లలు విరిగిపడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన వలస కూలీ శ్రీనివాస్(29) అక్కడికక్కడే మృతిచెం దాడు. బోయినపల్లి పూల్‌బాగ్ వద్ద సోమ వారం ఉదయం 6.30గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.సరైన భద్రతా ప్రమాణాలు పాటించ కపోవడం, అధికారుల పర్యవేక్షణ, నిఘా లోపంవల్లే ఈ ఘోరం చోటు చేసుకుందని నిపుణులు పేర్కొన్నారు.



గుంతలో మట్టి పెళ్లలు విరిగిపడి...

ఆర్‌యూబీ పనులు దక్కించుకున్న కాంట్రా క్టర్లు విజయ్, నాగభూషణ్‌రెడ్డి... మేస్త్రీ రమణ కు ఆ బాధ్యతను అప్పగించారు. కుత్బు ల్లాపూర్ ప్రశాంత్‌నగర్‌లో ఉండే 24 మంది కూలీలతో రెండు రోజుల కిందట రమణ పనులు ప్రారంభించాడు. కాగా, ఆర్‌యూబీ కోసం తవ్విన 6.5మీటర్ల భారీ గుంతల్లో పేరు కున్న మట్టిని తొలగించి బెడ్‌లు అమర్చాల్సి ఉంది. ఈ క్రమంలో కూలీలు సోమవారం గుంతల్లోకి దిగి మట్టి తీస్తుండగా... అదే సమయంలో క్రేన్‌తో సిమెంటు దిమ్మెను గుంతలోకి దించేందుకు ఉపక్రమించారు. దిమ్మ... పైనున్న మట్టి దిబ్బలకు తగిలి మట్టి పెళ్లలు గుంతలో ఉన్న కార్మికులపై పడ్డాయి.



దీంతో లోపలున్న శ్రీనివాస్ అక్కడికక్కడే మరణించగా, మరో కార్మికుడు శంకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రాము, రామారావు, ఆనంద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని బీబీఆర్ ఆసుపత్రికి తరలించారు. శంకర్ పరిస్థితి విషమంగా ఉంది. శ్రీనివాస్ మృతదేహాన్ని గాంధీ మార్చూరీకి తరలిం చారు. మృతుని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.

 

రూ.9 లక్షల నష్టపరిహారం

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ కాంట్రక్ట ర్ నుంచి శ్రీనివాస్ కుటుంబానికి రూ.9లక్షల నష్టపరిహారం, రూ.50వేలు దహన సంస్కా రాలకు ఇప్పించారు. గాయపడ్డ వారికి మెరు గైన చికిత్స అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని కాంట్రాక్టర్‌కు సూచించారు.

 

కాంట్రాక్టర్‌పై కేసు...

రైల్వే అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ శ్రీనివాసరావు, రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతుడి కుటుం బాన్ని పరామర్శించారు. బోయినపల్లి పోలీసులు కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేశారు. కాంట్రాక్టర్‌కు చెందిన క్రేన్ ఆపరేటర్ అజాగ్రత్తవల్లే ఈ ప్రమాదం జరి గిందని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్ తెలిపారు. కూలీలు బయట కు వచ్చిన తరువాత బాక్స్‌లను ఏర్పాటు చేసివుంటే ఈ ప్రమాదం జరిగుండేది కాదని నిపుణులు అంటున్నారు.అక్కడే ఉన్న రైల్వే ఇంజనీరింగ్ అధికారులు... గుంతలో ఉన్న కూలీలను కనీసం అప్రమత్తం చేయకపోవడం గమనార్హం.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top