కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ అరెస్ట్‌


హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. హనుమంతరావును హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. సోమాజీగూడ రాజీవ్‌ గాంధీ విగ్రహం వద్ద వీహెచ్‌ పలువురు కాంగ్రెస్‌ నేతలతో కలిసి ధర్నా చేస్తుండగా పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి గోషామహాల్ పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు. మూడు రోజుల క్రితం  అసెంబ్లీ ప్రాంగణంలో ఓ పోలీస్ అధికారిని తాను చీవాట్లు పెట్టానంటూ తనపై అసత్య ఆరోప‌ణ‌లు మోపి కేసు న‌మోదు చేశార‌ని పేర్కొంటూ వీహెచ్  రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. తనపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని వీహెచ్‌ అన్నారు.

 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top