లీడర్ లేకే ఓడిపోయాం

లీడర్ లేకే  ఓడిపోయాం - Sakshi


కొంప ముంచిన సమన్వయ లోపం

జైపాల్‌రెడ్డి ఒంటెద్దు పోకడలతో నష్టం

పొన్నాల వద్ద పాలమూరు కాంగ్రెస్ నేతల ఆవేదన


 

సాక్షి, హైదరాబాద్ : అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రానికి ఎవరు నాయకత్వం వహిస్తారనే విషయాన్ని ఫోకస్ చేయకపోవడంవల్లే గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని ఆ పార్టీ పాలమూరు నేతలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎదుట కుండబద్దలు కొట్టి చెప్పారు. దీనికితోడు నేతలమధ్య సమన్వయలోపం కూడా పార్టీ కొంపముంచిందని వాపోయారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయం లో హైకమాండ్ ఏ లీడర్‌ను ఫోకస్ చేసినా మద్దతిస్తామని ముక్తకంఠంతో చెప్పారు.

 

కొందరు నాయకులైతే కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డిపై ఫిర్యా దు చేశా రు. ఎన్నికల్లో జైపాల్‌రెడ్డి ఒంటెద్దు పోకడలవల్ల జిలా ్లలో పార్టీ తీవ్రంగా నష్టపోయిందని వాపోయారు. గాంధీభవన్‌లో గురువారం మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో పొన్నాల సమావేశమై ఎన్నికల్లో ఓటమికి కారణాలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. మాజీమంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ విఠల్‌రావు, డీసీసీ అధ్యక్షు డు ఒబేదుల్లా కొత్వాల్, పార్టీ జిల్లా ఇన్‌చార్జీ రమాదేవితోపాటు ముఖ్యనేతలు హాజరుకాగా, కేంద్ర మా జీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి గైర్హాజయ్యారు. అనంతరం డీకే అరుణ తదితరులు మీడియాతో మాట్లాడారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top