4జీ వైఫై... వస్తోందోయ్!

4జీ వైఫై... వస్తోందోయ్!


ఎప్పుడూ నాలుగు గోడల మధ్య కూర్చొని పని చేయడం కంటే అప్పుడప్పుడూ ఆరుబయట కూర్చొని ప్రకృతి అందాలను తిలకిస్తూ... పక్షుల కిలకిలారావాలు వింటూ విధులు నిర్వహిస్తే ఎంత బాగుంటుందో కదూ... ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు బోర్ కొట్టకుండా ఉండేందుకు ఇలాంటి వాతావరణాన్ని కోరుకుంటుంటారు. త్వరలో వారి కల నెరవేరబోతోంది. మాదాపూర్‌లో 4జీ వైఫై సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి.

 

మాదాపూర్: మాదాపూర్‌లో త్వరలో 4జీ వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఐటీ కారిడార్‌లో వైఫై సేవలందించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. ఐటీ ఉద్యోగులతో పాటు విద్యార్థులు, వ్యాపారులు, సాధారణ ప్రజలూ వైఫై సేవలు వినియోగించుకునేందుకు వీలుంటుంది. మాదాపూర్ శిల్పారామంలో వైఫై పనులు చురుగ్గా సాగుతున్నాయి. రిలయన్స్ సంస్థ 4జీ వైఫై అండర్ గ్రౌండ్ కేబుల్ పనులు దాదాపు పూర్తి చేసింది. శిల్పారామంలో ప్రతి 250 మీటర్ల దూరానికి ఆరేసి వైఫై పాయింట్లను ఏర్పాటు చేశారు.

 

ప్రధాన ద్వారం లాన్ వద్ద, ఆంపీ థియేటర్, నైట్‌బజార్, రూరల్ మ్యూజియం, కోనసీమ, రద్దీగా ఉండే ప్రాంతాలలో పాయింట్లు ఏర్పాటు చేశారు. త్వరలో 4జీ సేవలను సందర్శకులకు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆంపీ థియేటర్ వద్ద గ్రౌండ్ బాస్ మాస్ట్ (జీబీఎం)ను ఏర్పాటు చేశారు. ఈ జీబీఎం 500 మీటర్ల రేడియేషన్‌ను కవర్ చేస్తుంది. దాదాపుగా శిల్పారామంలోని అన్ని ప్రాంతాలకు వైఫై అందుబాటులో ఉంటుంది.

 

హైటెక్ సిటీలో...


సైబర్ పెరల్, హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్, హెచ్‌ఐసీసీ వద్ద కూడా వైఫై పాయింట్లను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీంతో మాదాపూర్‌లోని ఐటీ కారిడార్‌లో వైఫై సేవలు అందుబాటులోకి వచ్చే వీలుంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top