ష్‌.. అప్పుడే ఏం మాట్లాడొద్దు!

ష్‌.. అప్పుడే ఏం మాట్లాడొద్దు! - Sakshi


అమిత్‌ షా విమర్శలపై నేతలకు సీఎం సూచన

- ఆచితూచి స్పందించాలని నిర్ణయం

- పర్యటనతో ఇబ్బందేమీ లేదని భావన




సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పర్యటనను అధికార టీఆర్‌ఎస్‌ నిశితంగా పరిశీలిస్తోంది. ప్రధానంగా అమిత్‌ షా ప్రసంగాలు, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వంటి వాటిపై ఎట్టి పరిస్థితుల్లో తక్షణమే స్పం దించవద్దని, ఏది పడితే అది మాట్లాడొద్దన్న సూచనలు ఆ పార్టీ నేతలకు అందినట్లు సమాచారం. బీజేపీ అధ్యక్షుడి మూడ్రోజుల పర్యటన ముగిశాక ఆయన విమర్శలను పరిశీ లించి, సమీక్షించుకున్న తర్వాతే స్పందిం చాలని గులాబీ అధి నేత, సీఎం కేసీఆర్‌ నుంచి మంత్రులు, ఇతర నేతలకు ఆదేశాలు వెళ్లాయని తెలుస్తోంది.



తర్వాత సంబంధాలెలా ఉంటాయో?

టీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టి మూడేళ్లు పూర్తి కావొస్తోంది. ఎన్నికలకు మరో రెండేళ్ల గడు వున్న క్రమంలోనే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇటీవల మరింత దూకుడు పెంచా రు. ఇందులో భాగంగా వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ప్రకటనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలు సైతం కార్యరంగంలోకి దూకుతున్నాయి. అమిత్‌ షా పర్యటన కూడా ఇందులో భాగమని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. అయితే ఆయన పర్యటనతో తమకేం ఇబ్బంది లేదన్న అభిప్రాయం టీఆర్‌ఎస్‌ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ మూడేళ్లలో కేం ద్రంలోని బీజేపీ సర్కారుతో టీఆర్‌ఎస్‌ సఖ్యత గానే ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వ వినతులనూ కేంద్రం తక్షణమే నెరవేరుస్తూ అడిగిన వెంటనే కాదనకుండా అన్ని పనులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూ వస్తోంది.



ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినా కేంద్రంతో స్నేహం గానే ఉంటోంది. సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ‘మిషన్‌ భగీరథ’ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ వచ్చి వెళ్లారు. ఇటీవలే భూసేకరణ బిల్లుకు కూడా ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో చేపట్టనున్న విద్యుత్‌ ప్రాజెక్టులకు అనుమ తులు ఇచ్చింది. తాజాగా కొత్త సచివాలయ నిర్మాణానికి పరేడ్‌ గ్రౌండ్‌ను ఇవ్వడానికి కేంద్రం మొగ్గు చూపింది. ఈ సానుకూల అంశాల నేపథ్యంలో అమిత్‌ షా టూర్‌పై నేతలు అనవసరంగా విమర్శలు చేయొద్దని, ఆచి తూచి వ్యవహరించాలని సీఎం పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయ మని బీజేపీ నేతలు పదేపదే ప్రకటనలిస్తు న్నారు. కానీ  కాంగ్రెస్‌ బలంగా ఉన్న ప్రాంతా లపైనే బీజేపీ దృష్టి పెట్టిందన్న అభిప్రాయం గులాబీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. షా  స్పందనను బట్టే ప్రతిస్పందించాలని, నేతలెవరూ తొందరపడి మాట్లాడొద్దని నిర్ణయానికి టీఆర్‌ఎస్‌ వచ్చినట్లు సమాచారం.  మొత్తానికి షా పర్యటన తర్వాత టీఆర్‌ఎస్‌–బీజేపీ సంబంధాలు ఎలా ఉంటాయోనన్న ఆసక్తికర చర్చ రెండు పార్టీల్లోనూ జరుగుతోంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top