సిటీ వాణిశ్రీలు

సిటీ వాణిశ్రీలు


తావులు విరజిమ్మే విరులు సిద్ధంగా ఉన్నా.. వాటిని తురుముకునే సిగలు కనిపించకుండా పోయాయి. ముడులు వేసి మరులు గొలిపే వాలుజడలు  పోనిటెయిల్‌లా మారిపోయాయి. మూరెడు పూలతో ముస్తాబయ్యే బారెడు జడలకు ఫ్యాషన్ దిష్టి తగిలి జానాబెత్తెడు బాబీహెయిర్‌గా రూపుదిద్దుకున్నాయి. కుచుల కుచుల ముడులు వేసే అవకాశం కోల్పోయిన కురులు.. మగువలకు కొప్పులు చుట్టుకునే భాగ్యం లేకుండా చేశాయి. 1970లలో వాణిశ్రీ కొప్పులను స్ట్రిక్ట్‌గా ఫాలో అయిన ఆతరం వనితాశ్రీలు.. ప్రస్తుతం కొలతలు పడిపోయిన ఈ తరం పొట్టిజడను చూసి నవ్వుకుంటున్నారు. కొన్నేళ్లుగా ఆదరణ కోల్పోయిన సిగలు రెడీమేడ్‌గా మార్కెట్లో ప్రత్యక్షం అవుతూ.. తరణుల తలపై చేరేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నాయి. నెత్తిన కొప్పెట్టుకునే అవకాశం లేని కోనంగులు.. ఇప్పుడు రెడీమేడ్ కొప్పులను ఆశ్రయిస్తున్నారు. కొప్పులు చుట్టుకోవడంలో ఒకప్పుడు ట్రేడ్ మార్క్ సృష్టించిన వాణిశ్రీని మళ్లీ  ఫాలో అవుతున్నారు సిటీ స్త్రీలు. ఎలాంటి శ్రమ లేకుండా.. నయా ట్రెండ్‌ను ఫాలో అవుతున్న నగరవనితా లోకం ఇప్పుడు కొప్పు చూడు కొప్పందం చూడు అంటోంది.                ..:: శిరీష చల్లపల్లి

 

మగువలు మనసు పడేది కురుల మీదే. బిజీలైఫ్‌లో గజిబిజిగా కాలం వెళ్లదీస్తున్న నగర యువతులు సౌందర్యసాధనకు అంతో ఇంతో సమయం కేటాయిస్తారు. అయితే వాలుజడలపై మోజు ఎంతున్నా.. వాటిని మెయింటెయిన్ చేసే తీరిక లేక పోనిటెయిల్‌కు షిఫ్ట్ అయిపోతున్నవారు ఎందరో ఉన్నారు. ఇంత వరకు ఎలా ఉన్నా.. ఏ పండుగో, పబ్బమో వచ్చే సరికి పొడవాటి జడ లేదని ఆవేదన చెందుతుంటారు. అప్పటికప్పుడు లాంగ్ హెయిర్ వచ్చేస్తే ఎంత బాగుండో అని ఆశగా జడవైపు చూస్తుంటారు. సిగలో కనిపించాలని ఎంతున్నా.. అలాంటి అవకాశం లేక దిగులు పడుతుంటారు. పొడవాటి జుట్టున్న వారు సైతం, దాన్ని కొప్పుగా చుట్టుకునే ఓపిక లేక.. ఫ్రీగా వదిలేసి చేతులు దులుపుకుంటున్నారు. సవరంతో జుట్టును కాస్త సవరించుకున్నా.. అదెక్కడ ఊడిపోతుందోనన్న టెన్షన్‌తో వాటినీ పక్కన పెట్టేశారు. ఇలాంటి వుగువల వూనసిక బాధకు చెక్ పెడుతూ ఫ్యాషన్ ప్రపంచం రెడీమేడ్ కొప్పులు తీసుకొచ్చింది.



జుట్టు కొద్దీ కొప్పు



కురుల వుుడులకు కొత్త సొగసులు అద్దుతున్న రెడీమేడ్ కొప్పులు ఇప్పుడు సిటీ వనితలను కొత్తగా పలకరిస్తున్నాయి. జుట్టుకు తగ్గ కొప్పులు వచ్చేశాయి. ట్రెడిషనల్, ఫంక్షనల్.. ఇలా సందర్భానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేసిన సిగలు దొరుకుతున్నాయి. హెయిర్ స్టైల్‌కు, కలర్‌కు నప్పే కొప్పులపై యువతులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎలాస్టిక్ ైటె ప్, క్లచ్ క్లిప్, హెయిర్ పిన్ టైప్ కొప్పులు గంటల తరబడి సెట్ చేసుకునే పని లేకుండా ఈజీగా తలలో ఇమిడిపోతున్నాయి. ఎలాస్టిక్ బ్యాండ్‌తో ఉన్న కొప్పులను కురులకు బిగిస్తే చాలు కొత్త లుక్ వచ్చేస్తుంది. క్లచ్ క్లిప్, హెయిర్ పిన్ సిగలు ఎలాంటి రిస్క్ లేకుండా మీ జుట్టును గట్టిగా పట్టుకుంటాయి.



సిగకు వగలు



సిగను మరింత అందంగా చూపించే హెయిర్ యాక్సరీస్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నారుు. కొప్పును ముస్తాబు చేసేందుకు ముత్యాలు, క్రిస్టల్స్,  గ్లిటరింగ్ ఫ్లవర్స్‌కు డిమాండ్ విపరీతంగా ఉంది. లక్ష్మీదేవి బిళ్లలు, లట్కా హ్యాంగింగ్స్.. మీ సిగను మరింత సుందరంగా చూపిస్తాయి. సిగలో తురుముకునేందుకు బంగారు, వెండి పూలు మార్కెట్లో విరబూస్తున్నాయి. ఇలా సిగల సొగసును ఇనుమడింపజేసేవెన్నో ఇప్పుడు ఫ్యాషన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇన్ని వగలున్న సిగలను నెత్తిన చుట్టుకోవడానికి పట్టే సమయం కూడా చాలా తక్కువే. రెడీమేడ్ సిగలను అలా ఫిక్స్ చేసుకుంటే చాలు.. మీరు మెచ్చిన అందం ఇలా మీ సొంతం

 అవుతుంది.



బ్రైడల్ నాట్స్..



రిసెప్షన్ వేడుకలో.. కాస్త డిఫరెంట్‌గా కనిపించాలనుకుంటున్న నవ వధువులు.. బ్రైడల్ నాట్స్ ప్రిఫర్ చేస్తున్నారు. గాగ్రా, ఫ్రంట్ పల్లు శారీస్, హాఫ్ శారీస్, ఫ్లోర్ లెన్త్ ఫ్రాక్స్‌కు నప్పే విధంగా సిగలు ధరిస్తున్నారు. ఇక క్రిస్టియన్స్ పెళ్లి వేడుకలో బ్రైడ్ నాట్స్ ప్రత్యేక ఆకర్షణ. వురింకెందుకు ఆలస్యం  నెత్తిన కొప్పు.. ఆ కొప్పున పూలెట్టుకోవ డానికి సిద్ధమైపోండి.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top