Six pack.. అక్కర్లేదు!

Six pack.. అక్కర్లేదు! - Sakshi


‘సిక్స్ ప్యాక్ బాడీ ఉన్నోడు నాకు అక్కర్లేదు. చూడ చక్కనోడు చాలు..’  అంటోంది బబ్లీ గాళ్ చార్మి. జూబ్లీహిల్స్‌లోని హెలియోస్ ఫిట్‌నెస్ స్టూడియోలో ‘ఫిట్‌నెస్ అవేర్‌నెస్ వీక్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా సిటీప్లస్‌తో ప్రత్యేకంగా ముచ్చటించింది. విశేషాలు ఆమె మాటల్లోనే..

 

18-30 కీలకం

హెల్త్, ఫిట్‌నెస్‌లకు సంబంధించి 18-30 ఏళ్ల వయసు చాలా కీలకమైంది. ఈ వయసులో ఏర్పడే ఆహారపు అలవాట్లు, ఫిట్‌నెస్ రొటీన్.. తర్వాత కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువ. ఒక వయసు దాటాక.. ఫిట్‌నెస్ మన చేయి దాటిపోతుంది. హెల్దీ ఫుడ్ ఎంత అవసరమో.. రెగ్యులర్ వర్కవుట్ కూడా అంతే ముఖ్యం. సినీ తారని కాకపోయి ఉంటేనా.. నా ఫుడ్ హ్యాబిట్స్‌కు ఈ పాటికి 100 కిలోలు ఉండేదాన్ని వారంలో ఐదు రోజులు ఓ గంట వర్కవుట్ తప్పకుండా చేస్తుంటాను. వారంలో ఆరు రోజులు స్ట్రిక్ట్ డైట్ ఫాలో చేస్తాను.

 

ప్లానింగ్ మస్ట్

చాలా మందికి ఒక్క రోజులో మొత్తం ఫిజిక్‌ని మార్చేయాలకుంటారు. కానీ ప్లాన్డ్ వర్కవుట్‌తోనే ఎప్పుడు బరువు పెరిగినా తగ్గించుకోవచ్చు నాలాగ. (బాగా బరువు పెరిగిన చార్మి  ఇటీవల 11 కిలోలు తగ్గింది). ఇక హీరోలంతా మంచి ఫిట్‌నెస్ మెయింటేన్ చేస్తున్నారు. సిక్స్ ప్యాక్‌లు అవీ అక్కర్లేదు గాని, పర్ఫెక్ట్ బాడీ ఉండి, ఫ్లాట్ అబ్డామిన్ ఉన్న గైస్ నాకు నచ్చుతారు.

- ఎస్.సత్యబాబు

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top