సోషల్‌ మీడియాను అణచివేసే కుట్రలు

సోషల్‌ మీడియాను అణచివేసే కుట్రలు - Sakshi


వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజం



సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న సామాజిక మాధ్యమాన్ని దారుణంగా అణచివేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం రాక్షస కుట్రలు సాగిస్తోందని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. సోషల్‌ మీడియాలో వస్తున్న విమర్శలతో చంద్రబాబు వణికిపో తున్నారని చెప్పారు. ఆయన శుక్రవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవలి కాలంలో సోషల్‌ మీడియాలో వెలువడిన కథనాలపై సీఎం తనయుడు నారా లోకేశ్‌ అక్కసు వెళ్లగక్కారని, ఆ మీడియాను నిషేధించాలని అన్నారని గుర్తుచేశారు.



గూగుల్‌లో ‘పప్పు ఆంధ్రప్రదేశ్‌’ అని కంపోజ్‌ చేయగానే లోకేశ్‌ బొమ్మతో సహా వస్తుందని, అంతమాత్రాన గూగుల్‌నే నిషేధించడం సాధ్యమా? అంత శక్తి చంద్రబాబు, లోకేశ్‌కు ఉందా? అని భూమన ప్రశ్నించారు. ‘‘ గతంలో ఇదే సామాజిక మాధ్యమాల ద్వారా వైఎస్‌ జగన్‌పై హేయంగా దాడి చేసి, ప్రయోజనం పొందిన విషయాన్ని మరిచారా, ప్రభు త్వ అరాచకాలను బయట పెడుతున్న వారిని అణగదొక్కాలనే కుట్రలు చేస్తున్నారు. తన పాలనే శాశ్వతం, తనను పొగిడితేనే ప్రజాస్వామ్యం అని చంద్రబాబు అనుకుంటే  దిగజారుడుతనమే. ప్రజాగ్రహ ం బాబును తరిమికొ ట్టడం ఖాయం’’ అని భూమన  తేల్చిచెప్పారు.



జేసీ దూషణలు... బాబు పైశాచికానందం

‘‘రాష్ట్రంలో కులాల మధ్య కుంపటి పెట్టి చంద్రబాబు రాక్షసానందం పొం దుతున్నారు. తన పాలనను వ్యతిరేకించిన వ్యక్తులపై టీడీపీ నేతలతో అసభ్యకరంగా దూషణలు చేయిస్తున్నారు. జగన్‌పై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.  ప్రతిపక్ష నేతను దుర్మార్గమైన పదజాలంతో దూషిస్తుంటే, దాన్ని ఆపాల్సిన సంస్కారం చంద్రబాబుకు లేదా? ’’ అని భూమన ప్రశ్నించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top