కార్పొరేషన్లకు చైర్మన్లు ఖరారు

కార్పొరేషన్లకు చైర్మన్లు ఖరారు


సాక్షి, హైదరాబాద్: గత సాధారణ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ఆ వర్గాల్లో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం కాపు సంక్షేమ అభివృద్ధి సంస్థకు చైర్మనఖను నియమించారు. కాపు సంక్షేమ అభివృద్ధి సంస్థతో పాటు ఆంధ్రప్రదేశఖలో 7 కార్పొరేషనఖలకు కూడా చైర్మన్లను నియమించినట్టు సమాచార పౌర సంబంధాల శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుమారుడు పార్టీ ప్రధాన కార్యదర్శి లోకే?షను సంప్రదించిన తర్వాత ఈ నియామకాలను ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.


 


ఛైర్మన్లుగా నియమితులైన వారిలో పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి చలమలశెట్టి రామాంజనేయులు (కాపు సంక్షేమం, అభివృద్ధి సంస్థ),  పార్టీ ఏపీ విభాగం ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య (రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ), పార్టీ మీడియా కమిటీ సమన్వయకర్త ఎల్వీఎస్సార్కే ప్రసాద్ (గిడ్డంగుల సంస్థ), పార్టీ అధికార ప్రతినిధులు పంచుమర్తి అనూరాధ (మహిళా సహకార ఆర్ధిక సంస్థ) మల్లేల లింగారెడ్డి (పౌరసరఫరాల సంస్థ), జూపూడి ప్రభాకరరావు (ఎస్సీ సహకార ఆర్ధిక సంస్థ),  హిందూపురం మాజీ ఎమ్మెల్యే బి. రంగనాయకులు (బీసీ ఆర్ధిక సహకార సంస్థ), ప్రొఫెసర్ వి.జయరామిరెడ్డి (రాష్ర్ట ఆర్ధిక సంస్థ) ఉన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top