ఇప్పుడూ హక్కులకు భంగమేనా: చాడ

ఇప్పుడూ హక్కులకు భంగమేనా: చాడ - Sakshi


సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడ్డాక కూడా హక్కులకు భంగం కలుగుతోందంటూ  రైతులు, బాధిత ప్రజలు మానవహక్కుల కమిషన్, హైకోర్టులను ఆశ్రయించాల్సి రావడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సిగ్గుతో తలదించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. బుధవారం  విలేకరులతో మాట్లాడారు. మెరుగైన పరిహారం పేరిట జీవో 123 ద్వారా అరచేతిలో స్వర్గం చూపించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసలు భూసేకరణ చట్టం, 2013ను  లోతుగా అధ్యయనం చేశారా అని ప్రశ్నించారు. హైకోర్టు విభజన అంశంపై జంతర్‌మంతర్ వద్ద ధర్నా అంటూ సీఎం సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేం దుకు  ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.  



 ఆ సఖ్యత ప్రమాదకరమే: నారాయణ

 ఎంఐఎంతో కేసీఆర్ సఖ్యతతో ఉండడాన్ని మతోన్మాదులు అవకాశంగా వినియోగించుకోవచ్చని సీపీఐ నేత నారాయణ అన్నారు. అది మంచిది కాదని హితవు పలికారు. అయితే దీనికి మూలం ఢిల్లీలో ఉందని, కేంద్రంలో బీజేపీ మతోన్మాద రాజకీయాలను ప్రోత్సహిం చడం సరికాదన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top