క్లిక్ దూరంలో బస్ టికెట్

క్లిక్ దూరంలో బస్ టికెట్


ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం... సంస్థ నినాదం. ఇప్పుడు టికెట్ రిజర్వేషన్ సులభం... అధికారుల మాట ఇది. ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీలు ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంది. దీని ద్వారా మనం ఎక్కదల్చుకున్న స్టేజీ నుంచి.. వెళ్లవలసిన ఊరికి బస్సులున్నాయా? ఉంటే.. ఎన్ని ఉన్నాయి?. ప్రయాణ చార్జీలు ఎంత? వంటి ఎన్నో విషయాలను ఒక్క క్లిక్‌తో తెలుసుకోవచ్చు.  

 - గాజులరామారం  

 ఆన్‌లైన్ రిజర్వేషన్ చేయాలంటే  మన వద్ద ఉండాల్సినవి...

 ఇంటర్‌నెట్ సౌకర్యంతో కూడిన మొబైల్/ కంప్యూటర్.

 బ్యాంక్‌డెబిట్/ క్రెడిట్ కార్డ్/ ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ సౌలభ్యం. ఐడీ ప్రూఫ్

 

ఆన్‌లైన్ రిజర్వేషన్ ఇలా ..

ఇందుకు http://apsrtconline.in/oprsweb/, http://www.tsrtcbus.in/oprsweb/ సైట్‌లలో ఏదో ఒకదానిని ఎంచుకోవాలి.

ఇప్పుడు విండోలో కనిపిస్తున్న ‘బుక్ యువర్ టికెట్ నౌ’ ఆప్షన్‌లో ఉన్న వివరాలు పూరించాలి.

మీకు ప్రయాణంతో పాటుగా తిరుగు ప్రయాణంకు కూడ టికెట్ కావాలంటే ‘రౌండ్ ట్రిప్’ను క్లిక్ చేయండి. వెళ్లే టికెట్ ఒక్కటే కావాలంటే ‘ఒన్ వే’ను క్లిక్ చేయాలి.

ఇక ఎక్కడి నుంచి ఎక్కడకు ప్రయాణం, పెద్దలు, పిల్లలు ఎంత మంది, ప్రయాణపు తేది, ఎలాంటి బస్సు కావాలి తదితర విషయాలు పూరించాలి.

‘కన్‌సిసన్’ ఆప్షన్ వద్ద మాత్రం ఆర్టీసీ సిబ్బంది, క్యాట్ కార్డ్ దారులు మినహా మిగిలిన వారు ‘జనరల్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

‘చెక్ ఎవైలబిలిటి’ని క్లిక్ చేస్తే మీరు వెళ్లే ప్రాంతంకు ఏఏ బస్సులు ఉన్నవి, ప్రయాణ చార్జీ ఎంత, అవి బయలుదేరే సమయం, చేరుకునే సమయం వివరాలు కనిపిస్తాయి.

మీకు అనుగుణంగా ఉన్న బస్సును ఎంచుకుని ‘బుక్ నౌ’ను క్లిక్ చేయాలి.

ఇప్పుడు మీరు లాగిన్ కావాలి.

ఇందుకు ‘సైన్ అప్’ను క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ కనిపిస్తుంది.

ఇందులో మీ పూర్తి వివరాలు నమోదు చేసి సబ్‌మిట్ చేస్తే మీ మెబైల్‌కు పాస్‌వర్డ్ వస్తుంది. దీంతో మీరు లాగిన్ అవ్వవచ్చు.

లాగిన్ అయిన తర్వాత మీరు ఇంతకు ముందు ఎంచుకున్న బస్సులో అందుబాటులో ఉన్న సీట్లతో పాటుగా మీ వివరాలు అడుగుతుంది.

మీకు నచ్చిన సీట్‌ను ఎంచుకుని, వివరాలు నమోదు చేసి, వస్తున్న ఆప్షన్లను అనుసరిస్తూ పేమెంట్ చేయాలి. పేమెంట్ అయిన మరుక్షణమే మీకు మీరు పేర్కొన్న మెబైల్ నంబరుకు ఈ-టికెట్ వస్తుంది.

 

నోట్ : ఫోన్ నంబరు కచ్చితంగా సరైంది ఇవ్వాలి. ఎందుకంటే మీ ఈ- టికెట్ ఆ మెబైల్‌కే వస్తుంది. అదేవిధంగా మీ గుర్తింపు కార్డు నంబరును బుకింగ్ సమయంలో నమోదు చేయాలి. మీరు నమోదు చేసిన ఐడీ నంబరు కలిగిన ఒరిజినల్ ఐడీ ప్రూఫ్‌ను ప్రయాణ సమయంలో చూపించాలి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top