ఐఫోన్ దొరికితే వీరేం చేశారో తెలుసా?

ఐఫోన్ దొరికితే వీరేం చేశారో తెలుసా? - Sakshi


భాగ్యనగర్ కాలనీ(హైదరాబాద్): ఓ విలువైన ఫోన్ దారిలో కనిపిస్తే ఎవరైనా ఏం చేస్తారు? అదేమో గానీ ఓ ఇద్దరు చిన్నారులు మాత్రం దాన్ని నేరుగా తీసుకెళ్లి పోలీసులకు అప్పగించి తమ నిజాయతీని చాటుకున్నారు. కూకట్‌పల్లి భాగ్యనగర్‌కాలనీలోని కళామందిర్ రోడ్డులో ఆదివారం క్రికెట్ ఆడుకోవడం కోసం వచ్చిన నవీన్, కార్తీక్ అనే ఇద్దరు చిన్నారులు వాహనాల పార్కింగ్ వద్ద ఓ ఐఫోన్ కింద పడి ఉండగా చూశారు.



ఆ చిన్నారులు ఫోన్ తీసుసుకుని వెళ్లి కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు వారి నిజాయితిని, ధైర్యాన్ని అభినందించారు. వెంటనే ఫోన్ పోగొట్టుకున్నవారికి ఫోన్ చేసి ఆ చిన్నారుల సమక్షంలోనే పోలీసులు యజమానికి ఫోన్ అప్పగించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top