సునీత ఆత్మహత్యకు కారణమిదే...
హైదరాబాద్: టెలీ కాలర్ సునీత ఆత్మహత్యకు కారణమైన శ్రవణ్ కుమార్ పలువురు యువతులతో ప్రేమ వ్యవహారాలు నడుపుతున్నట్లు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. సునితతో పాటు మరో ముగ్గురు యువతులతో ప్రేమాయణం సాగించాడు. ఇదే విషయంపై అనుమానించిన సునీత గట్టిగా నిలదీయడంతో ఇరువురి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితులే సునీత ఆత్మహత్యకు దారితీశాయి. ఇందుకు సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలు సేకరించిన పోలీసులు శ్రవణ్‌ను శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.