త్వరలోనే ఇన్‌చార్జీల నియామకం

త్వరలోనే ఇన్‌చార్జీల నియామకం - Sakshi


- గ్రో అలోన్, గో అలోన్‌ మా సిద్ధాంతం...

- అధ్యక్షుడిగా ఏడాది పూర్తి చేసుకున్న లక్ష్మణ్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ




సాక్షి, హైదరాబాద్‌: త్వరలోనే 30, 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలను నియమించనున్నట్లు బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ వెల్లడించారు. ఆయా నియోజక వర్గాలకు ఇప్పటికే ఇన్‌చార్జిలను గుర్తించినట్లు చెప్పారు. దశల వారీగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమిస్తా మన్నారు. త్వరలోనే అన్ని నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్‌బూత్‌ స్థాయిల్లో కార్య కర్తల సదస్సులను నిర్వహిస్తామన్నారు.



టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు,  అప్రజాస్వామిక విధా నాలు, రైతులు, ధర్నాచౌక్, వంటి ప్రాధా న్యత సంతరించుకున్న ప్రజా సమస్యలపై టీడీపీతోసహా మిగతా పార్టీ లతో కలసి పనిచేసేందుకు అభ్యంతరం లేదన్నారు. రాష్ట్రంలో ‘గ్రో అలోన్, గో అలోన్‌’ (సొంతంగా ఎదు గు, ఒంటరిగా పయ నించు) సిద్ధాంతంతో ముందుకు సాగు తున్నామన్నారు. ఎన్డీఏలో టీడీపీ భాగ స్వామ్యపక్షమైనంత మాత్రాన తెలంగాణలో బీజేపీ సొంతంగా ఎదగకుండా ఉండాలని ఏమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయాలని రాష్ట్రపార్టీ నిర్ణయించిం దన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నా యంగా నిలిచే పార్టీ బీజేపీ అనే సంకేతాన్ని కార్యాచరణ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు. ముందస్తు ఎన్నికలు జరిగితే సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది కాలాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా ఆయన సాక్షి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వూ్యనిచ్చారు. ముఖ్యాంశాలు... ఆయన మాటల్లోనే...



‘‘అస్సాం, యూపీ, మణిపూర్, హర్యా నాలలో బీజేపీ సొంతంగా అధికారానికి వచ్చినపుడు తెలంగాణలో అది ఎందుకు సాధ్యం కాదనేది మా ప్రశ్న. అదే లక్ష్యాన్ని నిర్దేశించుకుని రాష్ట్రంలో ముందుకు సాగు తున్నాం. ఏడాదిలో మూడుసార్లు అమిత్‌షా, ఒకసారి ప్రధాని మోదీ, 15, 20 మంది కేంద్రమంత్రుల పర్యటనల ద్వారా పార్టీకి మంచి బలాన్ని, ఊపును తీసుకురాగలి గాము. రాష్ట్రంలో ఏ పార్టీకి లేని విధంగా అన్ని జిల్లాలు, మండలాల్లో కమిటీలు ఉన్న పార్టీ బీజేపీ మాత్రమే. పార్టీ జిల్లా, జోనల్‌ ఇన్‌చార్జీలను నియమిస్తున్నాము. ముస్లిం రిజ ర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా మని, దీంతో పాటు రైతులు, మద్యనియం త్రణ, నిరుద్యోగ సమస్య, రెండు పడక గదుల ఇళ్లు, సింగరేణి వారసత్వ ఉద్యోగాలు తదితర అంశాలపై ప్రజా ఉద్యమాలను ఉధృతం చేయాలని నిర్ణయించాం. పార్టీ విస్తరణ కోసం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మొదలుకుని మండలపార్టీ అధ్యక్షుడి వరకు 15 రోజుల పాటు గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించాం’ అని లక్ష్మణ్‌ చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top