Alexa
YSR
‘ప్రతి పల్లెలోనూ అందరికీ గ్యాస్‌ సరఫరా, ప్రతి మహిళకూ ఆర్థిక భరోసా నా ధ్యేయం’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం హైదరాబాద్కథ

మైనారిటీల ఓట్లపై బీజేపీ నజర్‌!

Sakshi | Updated: June 19, 2017 02:18 (IST)
మైనారిటీల ఓట్లపై బీజేపీ నజర్‌!
యూపీ ఫార్ములాను ఇక్కడా అమలు చేసే వ్యూహం
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మైనారిటీ ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. ఆ వర్గాల ఓట్లు, పోలింగ్‌ బూత్‌లపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణలో మెజారిటీ వర్గాలతోపాటు ముస్లింలు, ఇతర మైనారిటీల ఓట్లను సైతం తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తోంది. ఉత్తరప్రదేశ్‌ మొదలుకుని అస్సాం, ఉత్తరా ఖండ్, మణిపూర్, గోవాలలో మైనారిటీల ఓట్లకు గాలం వేయడం ద్వారానే అధికారానికి రాగలిగినందున ఇక్కడా అదే ఫార్మూలాను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ముస్లింలతోపాటు వివిధ మైనారిటీ వర్గాలున్న చోట్ల పార్టీపరంగా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది.

ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్, తది తర చోట్ల వివిధ రూపాల్లో కార్యాచరణను చేపట్టనుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం మూడేళ్ల పాలనపై మోదీ ఫెస్ట్‌ పేరిట, పార్టీ పరంగా చేపట్టే కార్యక్రమాల సంద ర్భంగా రాష్ట్రంలోని ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న లోక్‌సభ నియోజకవర్గాల్లో జాతీయ ముఖ్య నేతలు, కేంద్రమంత్రులు పర్యటిం చారు. ఇటీవల జరిగిన హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పోలింగ్‌బూత్‌ కమిటీ సభ్యుల సమ్మేళనంలో అమిత్‌షా పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో కేంద్రమంత్రులు హన్స్‌రాజ్‌ ఆహిర్, పరుషోత్తం రూపాలా, అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్, ఎంపీలు పర్యటించారు.
 
ముస్లిం పోలింగ్‌ బూత్‌లలో పాగా...  
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలుపుకుని 32 వేల పోలింగ్‌ బూత్‌లుండగా, పార్టీపరంగా 22, 23 వేల వరకు పోలింగ్‌ బూత్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు, స్థానిక సంస్థల్లో గెలిచేందుకు పోలింగ్‌బూత్‌ స్థాయిలో పార్టీ పటిష్టంగా ఉండాలని జాతీయ నాయకత్వం ఇది వరకే నిర్దేశించింది. పోలింగ్‌ బూత్‌స్థాయిలో విజయం సాధించగలిగితే ఏ ఎన్నికైనా సులువుగా గెలిచేందుకు వీలుం టుందని, అందుకు గుజరాత్‌ మొదలుకుని మధ్యప్రదేశ్, రాజస్థాన్, తదితర బీజేపీ పాలిత రాష్ట్రాలే నిదర్శనమని రాష్ట్రపార్టీకి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా గతంలోనే స్పష్టంచే శారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో కలుపుకుని మొత్తం మూడు వేల వరకు పోలింగ్‌ బూత్‌లలో మైనారిటీలు అందులోనూ ముస్లింల ప్రాబల్యం ఉందని పార్టీ గుర్తించింది. ఈ వర్గాలకు దగ్గరయ్యేలా జాతీయస్థాయి ముఖ్యనేతలు, మైనారిటీ నా యకులు, కేంద్రమంత్రుల ద్వారా వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. 

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

పట్టాలు తప్పిన ఉత్కళ్‌

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC