రాజధాని నిర్మాణం పేరుతో రూ. 50 వేల కోట్ల దోపిడీకి కుట్ర

రాజధాని నిర్మాణం పేరుతో రూ. 50 వేల కోట్ల దోపిడీకి కుట్ర - Sakshi


చంద్రబాబుపై ధ్వజమెత్తిన భూమన కరుణాకర్‌రెడ్డి  

సింగపూర్‌ కంపెనీలకే అప్పగించాలనే ఉద్దేశంతో తాజా నోటిఫికేషన్‌




సాక్షి, హైదరాబాద్‌: రాజధాని నిర్మాణం పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రూ 50 వేల కోట్ల  దోపిడీకి కుట్ర పన్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం విలేకరుల తో మాట్లాడుతూ ‘స్విస్‌ చాలెంజ్‌’ విధానం అమలుపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా చంద్రబాబు మాత్రం రాజధాని నిర్మాణాన్ని సింగపూర్‌ కంపెనీలకే అప్పగించాలనే ఏకైక ఉద్దేశంతో తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేశారని విమర్శించారు. రాజధాని ప్రాంతం అభివృద్ధి పనుల్లో ఇతర కంపెనీలేవీ పాల్గొనడానికి వీల్లేని విధంగా సింగపూర్‌ కన్సార్టియంకే దక్కే విధంగా విధానాలు రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.



  ప్రజలు, ప్రతిపక్షాలు ఈ విధానంపై అభ్యంతరం వ్యక్తం చేసిన చంద్రబాబు లెక్కచేయడం లేదన్నారు. గత ఏడాది జూలై 17వ తేదీన స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని అనుసరించి జారీ చేసిన నోటిఫికేషన్‌పై హైకోర్టు సెప్టెంబర్‌ 12వ తేదీన తీర్పు నిచ్చిందన్నారు. ఆదాయాన్ని ప్రథమ దశలోనే వెల్లడించాలని హైకోర్టు చెబితే ఆ విధానాన్ని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించారన్నారు. ఏపీఐడీఈ చట్టానికి సవరణలు చేసి పూర్తి అధికారాలను తనకే సీఎం దఖలు పర్చుకున్నారని దుయ్య బట్టారు. సవరణల తరువాత ఈ నెల 3వ తేదీన తాజా నోటిఫికేషన్‌ ఇచ్చారన్నారు.



స్విస్‌ చాలెంజ్‌ పరమ చెత్త విధానమని కేల్కర్‌ కమిటీ 2011లోనే తేల్చిందని, అయినా చంద్రబాబు బరితెగించి తన దోపిడీ కోసమే దీనిని అమలు చేయాలని చూస్తున్నారని భూమన మండిపడ్డారు.



ఆ కంపెనీకోసం నిబంధనల మార్పా?

స్విస్‌ చాలెంజ్‌ను హైకోర్టు తప్పు పట్టినా కూడా మళ్లీ సింగపూర్‌ సంస్థలకే అప్పగించాలనే ఉద్దేశ్యంతో వేరే ఏ ఇతర కంపెనీలు పోటీకి రాకుండా నిబంధనలు మార్చేసి అర్హతలు లేకుండా చేశారని భూమన చెప్పారు. 1691 ఎకరాల్లో స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధికి సింగపూర్‌ కంపెనీలు రూ 306 కోట్లు పెట్టుబడిగా పెడితే అక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5,500 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. ఈ పెట్టుబడికి గాను రాష్ట్ర ప్రభుత్వ వాటా 42 , సింగపూర్‌ కన్సారŠ?ట్సయం వాటా 58 శాతం ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కమిటీకి సంబంధించిన డైరెక్టర్లలో అత్యధిక శాతం సింగపూర్‌ వారే ఉంటారని, సీఆర్‌డీఏ అధికారుల పాత్ర ఏమీ ఉండదని చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top