ఆనంద బుద్ద విహార్ పేరు మార్పు

ఆనంద బుద్ద విహార్ పేరు మార్పు


సికింద్రాబాద్: శాంతి కామకుడు, అహింసావేత్త బుద్దుని భోదనలు వినిపిస్తున్న సికింద్రాబాద్ మహేంద్రాహిల్స్‌లోని ఆనంద బుద్ద విహార్ పేరును మహాబోధి బుద్ధ విహార్ గా మార్చారు. ఈ మార్పు ఆదివారం నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నూతన ప్రాంగణాన్ని మహాబోధి బుద్ధ సొసైటీ అధ్యక్షుడు కసప్పాథెరా ఆదివారం ప్రారంభించారు. ఇక ఈ మహాబోధి బుద్ద విహార బాధ్యతలను బెంగళూరులోని మహాబోధి సొసైటీ వారు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మహాబోధి బుద్ధ విహార ప్రాంగణంలో దమ్మపద ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈనెల 8వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా బుద్ధుని పరిపాలనపై ప్రసంగాలు, ప్రత్యేక ప్రార్థనలు, బౌద్ధ పారాయణాలు నిర్వహిస్తారు. కాగా శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు బుద్ధ నామస్మరణ అఖండపారాయణం జరిగింది.

(మారేడుపల్లి)

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top