మళ్లీ కాజీపేట రైల్వే డివిజన్‌ ప్రతిపాదన


కొత్త జోన్లు, డివిజన్ల ఏర్పాటుపై నలుగురు సభ్యులతో కమిటీ



సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని కాజీపేటను రైల్వే డివిజన్‌గా మార్చాలన్న డిమాండ్‌పై కేంద్రంలో కదలిక వచ్చింది. తాజాగా దేశవ్యాప్తంగా కొత్త రైల్వే జోన్లు, డివిజన్ల ఏర్పాటు అంశాన్ని పరిశీలించేందుకు తాజాగా రైల్వే శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ముందుకు కాజీపేట డివిజన్‌ ఏర్పాటు డిమాండ్‌ వెళ్లింది. దక్షిణ మధ్య రైల్వేను తెలంగాణకు పరిమితం చేసి విశాఖ కేంద్రంగా ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్‌ చేస్తే కాజీపేటను కచ్చితంగా డివిజన్‌ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఏపీకి ప్రత్యేక జోన్‌ ఏర్పాటు చేస్తే దక్షిణ మధ్య రైల్వేను తెలంగాణకు పరిమితం చేయాల్సి ఉంటుంది.



అప్పుడు తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్‌ డివిజన్లు మాత్రమే ఉంటాయి. ఓ జోన్‌ మనుగడలో ఉండాలంటే కనిష్టంగా మూడు డివిజన్లు ఉండాలి. అప్పుడు కాజీపేటను డివిజన్‌గా మార్చి దక్షిణ మధ్య రైల్వేను కొనసాగించాలి. కానీ, విశాఖ కేంద్రంగా ఏపీకి ప్రత్యేక జోన్‌ విషయంలో కేంద్రప్రభుత్వం ఇప్పటివరకు సానుకూలత ప్రదర్శించలేదు. దీంతో జోన్‌ ఏర్పాటుపై స్పష్టత లేదు. ఆ పరిణామం జరగకపోతే కాజీపేటను ప్రత్యేక డివిజన్‌ చేయాల్సిన అవసరం రాదు. కానీ, దక్షిణ మధ్య రైల్వే విభజన జరగకున్నా కాజీపేటను ప్రత్యేక డివిజన్‌ చేయాలన్న డిమాండ్‌ ఇప్పుడు కొత్త కమిటీ ముందుకు వెళ్లింది.



కాజీపేట జంక్షన్‌  ప్రధాన కేంద్రమైనప్పటికీ పెద్దగా అభివృద్ధి చెందలేదు. డివిజన్‌ హోదా వస్తే ఆ వెలితి తీరుతుందన్న ఉద్దేశంతో ఈడి మాండ్‌  వచ్చింది. దీంతోపాటు నాందేడ్‌నూ డివిజన్‌గా మార్చాలన మరట్వాడా నేతలు కమిటీని ఆశ్రయిం చారు. మహారాష్ట్రలో అది వెనకబడ్డ ప్రాంతమని, ఆ ప్రాంతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉండటంతో వెనుకబడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top