నిన్న స్వాగత్ హోటల్, నేడు పెట్రోల్ బంక్

నిన్న స్వాగత్ హోటల్, నేడు పెట్రోల్ బంక్ - Sakshi


హైదరాబాద్ : నిన్న స్వాగత్ హోటల్, నేడు ఓయూలోని తార్నక పెట్రోల్ బంక్పై దాడి. ఉస్మానియా వర్సిటీ స్థలంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం తార్నాకలోని ఓ పెట్రోల్ బంక్పైకి ప్రయత్నించి, అక్కడ విధ్వంసం సృష్టించాలని చూశారు. అయితే సమయానికి అక్కడకు చేరుకున్న పోలీసులు వారి ప్రయత్నాలను వమ్ము చేశారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేకుంటే తమ ఆందోళనలు ఉధృతం చేస్తామని ఏబీవీపీ కార్యకర్తలు హెచ్చరించారు.



కాగా ఓయూ భూముల్లో ఇళ్లు నిర్మిస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనకు నిరసనగా ఆర్ట్స్ కళాశాల ఎదుట నిన్న ఏబీవీపీ కార్యకర్తలు చేతులకు తాళ్లు కట్టుకొని అర్ధనగ్న ప్రదర్శన చేశారు. మరోవైపు ఓయూలో ఆక్రమణకు గురైన భూములను ప్రభుత్వం యూనివర్సిటీకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ జూన్ 1న నిరుద్యోగ సింహగర్జన బహిరంగ సభను, జూన్ 2న తెలంగాణ అవతరణ ఉత్సవాలను బహిష్కరించి నల్లజెండాలతో నిరసన తెలియజేయనున్నట్లు టి.విద్యార్థి  నిరుద్యోగ జేఏసీ పేర్కొన్న విషయం తెలిసిందే.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top