బంజారాహిల్స్ పీఎస్ ఫేస్‌బుక్‌లో అశ్లీల చిత్రాలు

బంజారాహిల్స్ పీఎస్ ఫేస్‌బుక్‌లో అశ్లీల చిత్రాలు - Sakshi


హైదరాబాద్: ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలకు చేరువయ్యేందుకు సామాజిక అనుసంధాన వేదిక ఫేస్‌బుక్‌లో బంజారాహిల్స్ పీఎస్ పేరిట రూపొందించిన పేజీలో అశ్లీల చిత్రాలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నెల 28న 42 నుంచి 45 ఏళ్ల వయస్సున్న ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహానికి సంబంధించిన నగ్న చిత్రాలు ఫేస్‌బుక్ పేజీలో ఒక వ్యక్తి అప్‌లోడ్ చేయడం... ఇప్పటి వరకు పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.



ప్రజల నుంచి సలహాలు, సూచనల కోసం ఏర్పాటుచేసిన ఈ పేజీని ఎనిమిది నెలల క్రితం ప్రారంభించినమాట వాస్తవమేనని... నాలుగు నెలలుగా దాన్ని వాడటం లేదని పోలీసులు చెబుతున్నారు. గత నాలుగు నెలలుగా పీఎస్ బంజారాహిల్స్ పేరుతో కొత్త ఫేస్‌బుక్ పేజీని ప్రారంభించి... ప్రజల నుంచి సలహాలు, సూచనలను స్వీకరిస్తున్నామని అంటున్నారు. తొలి ఫేస్‌బుక్ పేజీని అనుసరిస్తున్న నగరవాసులు ఈ చిత్రాలపై మండిపడుతున్నారు. పాత ఎఫ్‌బీ అకౌంట్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top