జేఈఈ వెబ్‌సైట్‌లో ఆధార్ సహాయక కేంద్రాలు


- దేశవ్యాప్తంగా 104 కేంద్రాలు ఏర్పాటు

- తెలంగాణలో 3, ఆంధ్రప్రదేశ్‌లో 4..

 

 సాక్షి, హైదరాబాద్: డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న జేఈఈ దరఖాస్తుల ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు ఆధార్ నంబర్ లేని విద్యార్థులు ఆధార్ ఐడీ కోసం దరఖాస్తు చేసుకునేందుకు జేఈఈ పరీక్ష కేంద్రాలు ఉండే ప్రాంతాల్లో సహాయక కేంద్రాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఏర్పాటు చేసింది. విద్యార్థులు ఆయా కేం ద్రాలకు వెళ్లి ఆధార్ కోసం ఉచితంగా దరఖాస్తు చేసుకో వచ్చని తెలిపింది. తద్వారా వచ్చే ఆధార్ నంబర్ కాకుండా ఎన్‌రోల్ చేసుకోవడం ద్వారా వచ్చే ఐడీ నంబర్‌తో జేఈఈకి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఒకవేళ ఆయా కేంద్రాల్లో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సదుపాయం లేకపోతే.. విద్యార్థులు అదే కేంద్రంలో ఆధార్ కోసం విజ్ఞాపన పత్రం అందజేస్తే ఓ రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తారని, దానితో విద్యార్థులు జేఈఈ మెరుున్‌కు దరఖాస్తు చేసుకోవచ్చంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 104 ఆధార్ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అలాగే ఆయా పట్టణాల్లో జేఈఈ మెరుున్ రాత పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపింది. వివరాలకు జేఈఈ వెబ్‌సైట్ jeemain.nic.inను సంప్రదించవచ్చు.



 తెలంగాణలోని సహాయక కేంద్రాల వివరాలు..

 హైదరాబాద్: సీతాకిరణ్, ప్రిన్సిపాల్, డీఏవీ పబ్లిక్ స్కూల్, సఫిల్‌గూడ, సంతోషిమా నగర్, నేరెడ్‌మెట్, రామకృష్ణా పురం పోస్టు, సికింద్రాబాద్, ఫోన్: 040-2722 3721, 040- 27223392, 040-27225919, ఈమెరుుల్:seetha & kiran@yahoo.co.in

 ఖమ్మం:ఆర్.పార్వతిరెడ్డి, ప్రిన్సిపాల్, హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్, 5-7-200/11, మమత హాస్పిటల్ దగ్గర, పాకతబండ బజార్, ఖమ్మం, ఫోన్: 08742- 221444, 08742-2554 43, ఈమెరుుల్ : harvestkhammam @gmail.com



వరంగల్: జి.మథియాస్‌రెడ్డి, ప్రిన్సిపాల్, సెరుుంట్ పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్, ఓల్డ్ బస్ డిపో రోడ్, సెరుుంట్ పీటర్స్ కాలనీ, హన్మకొండ, వరంగల్, ఫోన్: 0870-25 79118, ఈమెరుుల్ ఐడీ:  spcpswgl@ gmail. com





 ఆంధ్రప్రదేశ్‌లోని సహాయక కేంద్రాల వివరాలు..

 గుంటూరు: డాక్టర్ సోమశేఖర శర్మ, ప్రిన్సిపాల్, డాక్టర్ కె.ఎల్.పి. పబ్లిక్ స్కూల్, జేకేసీ కాలేజ్ రోడ్, గుంటూరు, ఫోన్ నంబర్లు: 0863-2350392, 0863-2350391, ఈమెరుుల్ ఐడీ:  spcpswgl@ gmail. com



తిరుపతి: సీహెచ్ ప్రసాదరావు, ప్రిన్సిపాల్, కేంద్రీయ విద్యా లయ నంబర్-1, రామ్‌నగర్ ఏరియా, చెన్నారెడ్డి కాలనీ, తిరుపతి, ఫోన్ నంబర్లు: 0877-2232755, 0877- 2231457, ఈమెరుున్ ఐడీ:  kv1tpt@ yahoo. com

 విజయవాడ: డాక్టర్ కె.భావ్‌నారాయణ, ప్రిన్సిపాల్, కె.సి.పి. సిద్ధార్థ్ ఆదర్శ్ రెసిడెన్షియల్ స్కూల్, కానూరు, ఫోన్ నంబరు: 08662-2543436, ఈమెరుుల్ ఐడీ:  kcparpschool@rediffmail.com

 విశాఖపట్నం: ఎస్.ఆదేశ్‌శర్మ, ప్రిన్సిపాల్, కేంద్రీయ విద్యా లయ, ఎన్‌ఏడీ-పోస్టు, విశాఖపట్నం, ఫోన్ నంబర్లు: 0891-2571889, 0891-2571267, ఈమెరుుల్: kv9nad @gmail.com,  vkrishan799@gmail. com

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top