ఉద్యోగాల పేరుతో యువతులకు ఎర


హైదరాబాద్: బ్యూటీషియన్ల ఉద్యోగాల పేరుతో యువతులకు ఎర వేస్తున్న ఓ వ్యక్తి ఆటలకు పోలీసులు చెక్ పెట్టారు. ఉద్యోగాలిస్తాం రమ్మని పిలిచి అమ్మాయిలను మోసం చేస్తున్న సయ్యద్ సలీం అనే వ్యక్తిని బోయిన్ పల్లి పోలీసులు అరెస్టు చేశారు. అతడు పత్రికల ద్వారా బ్యుటీషియన్ ఉద్యోగాలకు ప్రకటనలు ఇస్తూ ఇంటర్వ్యూలకు పిలిచి అనంతరం వచ్చినవారిపై లైంగిక వేధింపులకు పాల్పడే వారని పోలీసులు తెలిపారు. ఇంకా అతడి వెనుక ఎవరెవరు ఉన్నారనే వివరాలు కూడా రాబడతామని చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top