మెట్రో భద్రతకు 48 పోలీసు ఔట్‌పోస్టులు

మెట్రో భద్రతకు 48 పోలీసు ఔట్‌పోస్టులు - Sakshi

మెట్రోరైలు భద్రత కోసం మూడు కారిడార్లలో కలిపి మొత్తం 48 పోలీసు ఔట్‌పోస్టులు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ మెట్రో రైలు అధికారులతో తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మెట్రోరైలు ప్రాజెక్టు ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 

మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టు భద్రత కోసం ఐదు ఏ-కేటగిరీ పోలీసు స్టేషన్లు, 12 బి-కేటగిరీ పోలీసు స్టేషన్లు ఏర్పాటుచేయాలని సమావేశంలో నిర్ణయించారు. మెట్రో కారిడార్ మొత్తంలో 48 ఔట్‌పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top