శ్రీయాన్ ప్రాణం తీసిన ప్లాస్టిక్ కవర్

ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని బాలుడి మృతి - Sakshi


హైదరాబాద్: ప్లాస్టిక్ కవర్ తో ఆట.. ఓ పసివాడి ప్రాణం తీసింది. ప్లాస్టిక్ కవర్‌ ను తలకు చుట్టుకుని నాలుగేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. కూకట్‌పల్లిలోని నిజాంపేట్‌కు చెందిన శ్రీయాన్ బుధవారం ఇంట్లో ప్లాస్టిక్ కవర్‌ను తలకు చుట్టుకుని ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ ఆ  కవర్ అతడి తలకు చుట్టుకుంది. అయితే తల్లి గమనించకపోవడంతో శ్రీయాన్ ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.  ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించిన తల్లిదండ్రులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీయాన్ మృతి చెందాడు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top