పుష్కరాలకు 200 ప్రత్యేక రైళ్లు

పుష్కరాలకు 200 ప్రత్యేక రైళ్లు


సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు మరో 200 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ గురువారం తెలిపారు. ఇదివరకు 130 రైళ్లను కేటాయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నాందేడ్-నిజామాబాద్ (07818) ప్రత్యేక రైలు ఈ నెల 17, 24 తేదీల్లో తెల్లవారుజామున 2 గంటలకు నాందేడ్ నుంచి బయలుదేరి అదే రోజు ఉదయం 3.45కి బాసర, 4.30కి నిజామాబాద్ చేరుతుంది.



తిరుగు ప్రయాణంలో నిజామాబాద్-ఆదిలాబాద్ (07819) రైలు ఈ నెల 17, 24 తేదీల్లో ఉదయం 5.30కి నిజామాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 11కి ఆదిలాబాద్ చేరుతుంది. ఆదిలాబాద్-నిజామాబాద్ (07820) ప్రత్యేక రైలు తిరిగి అదేరోజు మధ్యాహ్నం 12.30కి ఆదిలాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం 5.28కి బాసర, 6.15కి నిజామాబాద్ చేరుతుంది. నిజామాబాద్-నాందేడ్ (07821) సాయంత్రం 7.50కి నిజామాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 8.28కి బాసర, 10.30కి నాందేడ్ చేరుతుంది.



నాందేడ్-నిజామాబాద్-ఆదిలాబాద్ (07822/07823) స్పెషల్ ట్రైన్ ఈ నెల 18, 25 తేదీల్లో రాత్రి 11కి నాందేడ్ నుంచి బయలుదేరి రాత్రి 12.47కి బాసరకు, తెల్లవారు జామున 1.30కి నిజామాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో తెల్లవారు జామున 2కి నిజామాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 3.15కి బాసరకు, 8.30కి ఆదిలాబాద్ చేరుతుంది. ఆదిలాబాద్-నిజామాబాద్-నాందేడ్ (07824/07825) స్పెషల్ ట్రైన్ ఈ నెల 18, 25 తేదీల్లో ఉదయం 10కి ఆదిలాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.25కి బాసరకు, సాయంత్రం 3.15కి నిజామాబాద్ చేరుతుంది.



తిరుగు ప్రయాణంలో సాయంత్రం 4.15కి నిజామాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం 7కి నాందేడ్‌కు చేరుతుంది. సికింద్రాబాద్-భద్రాచలం (07828/07829) స్పెషల్ ట్రైన్ ఈ నెల 19, 26 తేదీల్లో ఉదయం 11కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి అదేరోజు సాయంత్రం 5కి భద్రాచలం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 20, 27 తేదీల్లో సాయంత్రం 4.30కి భద్రాచలం నుంచి బయలుదేరి అదేరోజు రాత్రి 10.30కి సికింద్రాబాద్ చేరుతుంది. సికింద్రాబాద్-మంచిర్యాల (07830/07831) ఈ నెల 13 నుంచి 26 వరకు ఉదయం 4.45కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి అదేరోజు ఉదయం 10కి మంచిర్యాల చేరుతుంది.



తిరుగు ప్రయాణంలో 13వ తేదీ నుంచి 26 వరకు సాయంత్రం 5.45కి మంచిర్యాల నుంచి బయలుదేరి రాత్రి 11.15కి సికింద్రాబాద్ చేరుతుంది. మంచిర్యాల-కాజీపేట్ (07832/07833) ఈ నెల 13 నుంచి 26 వరకు ఉదయం 11.10కి మంచిర్యాల నుంచి బయలుదేరి అదేరోజు మధ్యాహ్నం 1.40కి కాజీపేట్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.10 కి కాజీపేట్ నుంచి బయలుదేరి సాయంత్రం 4.45కి మంచిర్యాల చేరుతుంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top