హైదరాబాద్‌లో ఐసిస్ కలకలం

హైదరాబాద్‌లో ఐసిస్ కలకలం - Sakshi


హైదరాబాద్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్టుగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం హబీబ్‌ నగర్‌లోని ఓ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఆ ఇంట్లో నుంచి 6 తుపాకులు, 4 తల్వార్లు స్వాధీనం చేసుకున్నారు.



ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. వీరికి ఐఎస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్టుగా అనుమానిస్తున్నారు. సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి విచారణ చేపట్టారు. హబీబ్ నగర్, రాజేంద్రనగర్‌ ప్రాంతాలలో పోలీసులు ముమ్మరంగా సోదాలు చేపట్టారు. గతంలో కూడా ఐఎస్‌తో సంబంధాలున్నాయనే అనుమానంతో హైదరాబాద్‌ పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు.


















 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top