తిరుమలకు 120 రోజుల ముందే రిజర్వేషన్‌


హైదరాబాద్‌: తిరుమల వెళ్లే భక్తులు 120 రోజుల ముందుగా టికెట్లను, కాటేజీలను రిజర్వ్‌ చేసుకోవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. హైదరాబాద్‌వాసులు లిబర్టీ వద్ద గల కార్యాలయంలో ఈ–టికెట్లను పొందవచ్చు. అందుకు ప్రతి ఒక్కరూ గుర్తింపు కార్డు నకలు ఇవ్వాల్సి ఉంటుందని, ఆర్జిత సేవా టికెట్లను 60 రోజులు ముందుగా పొందవచ్చని పేర్కొన్నారు.



మరిన్ని వివరాలకు 040–2326 0590(హైదరాబాద్‌), 0877– 2233 333(తిరుపతి) ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top