సీనియర్ జర్నలిస్టు కన్నుమూత

సీనియర్ జర్నలిస్టు కన్నుమూత




పుణే : ప్రముఖ ఎడిటర్, సీనియర్  జర్నలిస్టు  దిలీప్‌ పద్గోంకర్‌ (72)  ఇక లేరు.  పుణేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం ఉదయం కన్నుమూశారు.    కొంతకాలంలో  కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన  తుదిశ్వాస విడిచారు.  టైమ్స్ ఆఫ్ ఇండియాకు మాజి ఎడిటర్ గా పనిచేసిన ఆయన  తనదైన   శైలిలో పాఠకులను ఆకట్టుకున్నారు.  1968లో  జర్నలిస్టుగా కరియర్ ప్రారంభించిన దిలీప్  దాదాపు ఆరేళ్లపాటు ఎటిటర్ గా పనిచేశారు.



జమ్మూ-కాశ్మీర్‌ లో శాంతి, సుస్థిరతలు నెల కొల్పే ఉద్దేశంతో  కేంద్రం ఏర్పాటు చేసిన మధ్యవర్తులు బృందంలో దిలీప్ పద్గోంకర్‌   ఒకరు. 2010లో యూపీఏ ప్రభుత్వం నియమించిన  కమిటీలో  ప్రముఖ విద్యావేత్త రాధాకుమార్‌, మాజీ కేంద్ర సమాచార కమిషనర్‌ ఎం.ఎం. అన్సారీ లతోపాటు  దిలీప్‌ పద్గోంకర్‌  సభ్యులుగా ఉన్నారు.  అటు  దిలీప్ పద్గోంకర్ మరణంపై పలువురు   సీనియర్  జర్నలిస్టులు,  రాజకీయవేత్తలు సంతాపం తెలిపారు.




 

Read also in:
Back to Top