తెలంగాణ పోలీసు శాఖకు ఐదు అవార్డులు

తెలంగాణ పోలీసు శాఖకు ఐదు అవార్డులు


హైదరాబాద్‌: తెలంగాణ పోలీసు శాఖ ప్రతిష్టాత్మకమైన ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. ఫిక్కీ నిర్వహించిన పోటీల్లో రాష్ట్ర పోలీసు శాఖ చేస్తున్న పాస్‌పోర్టు వెరిఫికేషన్‌కు స్మార్ట్‌ వెరిఫికేషన్‌ అవార్డు దక్కింది. ఈ అవార్డును ఫిక్కీ చైర్మన్‌ వైకే మోడీ చేతుల మీదుగా డీజీపీ అనురాగ్‌ శర్మ గురువారం అందుకున్నారు. సైబర్‌ నేరాల నియంత్రణకు కీలక కృషి చేస్తున్న హైదరాబాద్‌ కమిషనరేట్‌లోని సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు మరో అవార్డు దక్కింది. ఈ అవార్డును సైబర్‌ క్రైం ఏసీపీ రఘువీర్‌ అందుకున్నారు.



స్మార్ట్‌ పోలీస్‌ ఆఫీసర్‌ కేటగిరీ కింద హైదరాబాద్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డికి దక్కింది. ఈ అవార్డును హైదరాబాద్‌ అదనపు కమిషనర్‌ మురళీ కృష్ణ స్వీకరించారు. రాష్ట్ర పోలీస్‌ శాఖ మొత్తానికి స్మార్ట్‌ ఇన్నొవేటివ్‌ పోలీసింగ్‌ కింద స్పెషల్‌ జ్యూరీ అవార్డు, ఫింగర్‌ ప్రింట్స్‌ ఐడెంటిఫికేషన్‌ అండ్‌ నెట్‌వర్క్‌ సిస్టం ప్రాజెక్ట్‌కు సూర్యాపేట ఎస్పీ పరిమళ హనా నూతన్‌ మరో అవార్డు సొంతం చేసుకున్నారు. కార్యక్రమానికి శాంతి భద్రతల ఇన్‌చార్జి ఐజీ రమేశ్‌రెడ్డి హాజరయ్యారు. ఏపీ పోలీస్‌ శాఖ కూడా రెండు అవార్డులు సొంతం చేసుకున్నట్లు ఫిక్కీ తెలిపింది.




 

Read also in:
Back to Top