న్యూస్ అప్డేట్స్

న్యూస్ అప్డేట్స్


పార్లమెంట్ శీతాకాల సమావేశాలు: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా లోక్‌సభలో రాజ్యాంగంపై చేపట్టిన ప్రత్యేక చర్చ నేడు కూడా కొనసాగనుంది. డిసెంబర్ 23 వరకు జరగనున్న సమావేశాల్లో తొలి రెండు రోజులూ ప్రత్యేక చర్చ చేపట్టిన సంగతి తెలిసిందే.



వరద బాధితులకు పరామర్శ: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆయన పరమార్శిస్తారు. తూర్పుగోదావరిలోని కొత్తపేట నియోజకవర్మం దేవరాపల్లి, ఈతకోట, పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు, దువ్వ తదితర ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటన కొనసాగనుంది.



టీ- రిపోర్ట్: రైతు ఆత్మహత్యల విషయంలో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్న తెలంగాణలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, కరువు పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం నేడు కేంద్రానికి సమగ్ర నివేదిక సమర్పించనుంది.



సుల్తాన్ బజార్ బంద్: మెట్రో రైలు ఎలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ ప్రఖ్యాత సుల్తాన్ బజార్లో దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులు ఆందోళన ఉధృతం చేశారు. నేడు సుల్తాన్ బజార్ బంద్ కు పిలుపునిచ్చారు.



అంగన్ వాడీల పోరు: వేతనాలు పెంచాలడి డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అంగన్ వాడీ కార్యకర్తలు నేడు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించనున్నారు.



క్రికెట్ లో కొత్త అధ్యాయం: క్రికెట్ చరిత్ర నేడు కొత్త మలుపు తీసుకోనుంది. మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ డే- నైట్ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ల మధ్య నేటి ఉదయం(భారత కాలమానం ప్రకారం 9:30 గంటలకు) ప్రారంభమయ్యే మ్యాచ్ లో తొలిసారి గులాబి రంగు బంతుల్ని వినియోగిస్తుండటం విశేషం.



వరల్డ్ హాకీ లీగ్: రాయ్ పూర్ వేదికగా నేటి నుంచి వరల్డ్ హాకీ లీగ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్ లో భారత్- అర్జెంటీనాలు తలపడనున్నాయి.




 

Read also in:
Back to Top