విలేకరిపై అర్థరాత్రి పోలీసుల థర్డ్‌ డిగ్రీ


హైదరాబాద్‌: హైదరాబాద్‌: తెలంగాణ పోలీసుల దౌర్జన్యం మరోసారి బయటపడింది. అర్ధరాత్రి వేళ ఓటీవీ విలేకరిపై తమ లాఠీ జులుం చూపారు.  విలేకరి నాగరాజును పోలీసులు అర్ధరాత్రి నిర్బంధించి అత్యంత దారుణంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. వివరాల్లోకి వెళ్తే మహా న్యూస్ టీవీ రిపోర్టర్‌గా పనిచేస్తున్న నాగరాజు ఆదివారం తన స్నేహితుడి తండ్రి చనిపోవడంతో అతన్ని పరామర్శించడానికి చుడిబజార్‌ వెళ్లాడు.



అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఆ ప్రాంతంలో కొంతమంది మద్యం సేవించి ఘర్షణ పడుతున్నారు. పోలీసులు రావడాన్ని గమనించి వారంతా అక్కడ నుంచి పారిపోయారు. కొద్ది దూరంలో నాగరాజు దిల్‌సుఖ్‌నగర్ రావడానికి వేచి ఉండగా షాయినాత్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఎస్సై రాజు అతని దగ్గరికి వచ్చి ఎవరు నీవు అని నాగరాజును ప్రశ్నించారు. తాను మహా టీవీ రిపోర్టర్‌నని చెప్పినా ముందు స్టేషన్‌కు పద అంటూ వాహనంలో స్టేషన్‌కు తరలించారు. అంతేకాకుండా లాఠీలతో విచక్షణా రహితంగా చితక బాదడంతో స్పృహ కోల్పోయాడు. దీంతో వెంటనే బాధితుడిని ఆస్పత్రి చేర్చారు. నాగరాజుపై అకారణంగా దాడి చేసిన ఎస్సై రాజుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు.




 

Read also in:
Back to Top