ఉస్మానియాలో పేషంట్ల తరలింపు ప్రారంభం


హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి నుంచి పేషంట్ల తరలింపు ప్రక్రియ బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఆస్పత్రిలోని నాలుగు విభాగాలు జనరల్ మెడిసన్, జనరల్ సర్జరీ, సర్టకల్ గ్యాస్ర్టో , మెడికట్ గ్యాస్ర్టో విభాగాలను సుల్తాన్ బజార్ ప్రసూతి హాస్పటిల్ కు తరలించనున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం నుంచి అర్థోపెడిక్ విభాగాన్ని కింగ్ కోఠి ఆస్పత్రికి తరలిస్తారు. మొత్తం 740 పడకలు సుల్తాన్ బజార్ ప్రసూతి ఆసుపత్రిలో కొనసాగనున్నాయి. ఈ సేవలు కేవలం ఏడాది పాటు అక్కడ కొనసాగతాయి.




ఓపీ సేవలు యథాతథం

కాగా ఉస్మానియాలోని అవుట్పేషంట్ (ఓపీ) తోపాటు ఎమర్జెన్సీ విభాగాలు యధావిధిగా కొనసాగుతాయని ఆస్పత్రి సూపరిండెంటెంట్ రఘు తెలిపారు. ఓపీ పేషంట్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.




 

Read also in:
Back to Top