మధ్యాహ్నానికి 58 శాతం పోలింగ్


నారాయణఖేడ్: మెదక్‌ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గానికి శనివారం జరుగుతున్న ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం మందకొడిగా ప్రారంభమైనా... మధ్యాహ్నానికి పుంజుకుంది. శనివారం మధ్యాహ్నం 1 గంట సమయానికి పోలింగ్ 58.43 శాతానికి చేరుకుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. నియోజక వర్గ పరిధిలో 286 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

 

మరోవైపు చాలా చోట్ల ఓట్లు గల్లంతు కావడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గౌరారం తండాలోనే 70 ఓట్లు గల్లంతయ్యాయి. పలు చోట్ల ఇదేవిధమైన పరిస్థితి కనిపించింది. ఎన్నికల సిబ్బంది దగ్గర 2015 సంవత్సరానికి సంబంధించిన ఓటర్ల జాబితా ఉండగా... ఏజెంట్లు 2016 జాబితా ఆధారంగా ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశారు. దీంతో ఓట్ల గల్లంతు అయిన విషయం స్పష్టంగా కనిపిస్తోంది. 



 

Read also in:
Back to Top