అవినీతికి ఆధారం ఉందా?

అవినీతికి ఆధారం ఉందా? - Sakshi


పత్రికల్లో వార్త వస్తే పిటిషన్ వేయడమేనా హైకోర్టు




చెన్నై: డీఎంకే అధినేత ఎం కరుణానిధి, కోశాధికారి ఎంకే స్టాలిన్‌లు అవినీతికి పాల్పడ్డట్టుగా ఆధారాలు ఉన్నాయా? అని ఓ పిటిషనర్‌ను మ ద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. పత్రికల్లో వార్తలు వచ్చినంత మాత్రాన పిటిషన్లు వేయడమేనా, ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోమని విచారణను తిరస్కరించారు. పీఎంకే యువజన నేత అన్బుమణి రాందాసుకు వ్యతిరేకంగా దాఖలైన మరో కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు  ఉత్తర్వులు జారీ చేసింది.




 చెన్నైకు చెందిన న్యాయవాది బాలసుబ్రమణ్యం హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. డీఎంకే అధినేత ఎంకరుణానిధి, కోశాధికారి ఎంకే స్టాలిన్‌లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 2006-11 కా లంలో డీఎంకే హయాంలో అవినీతి జరిగి ఉండొచ్చన్నట్టుగా స్టాలిన్ సై తం వ్యాఖ్యలు చేసి ఉన్నారని వివరించారు. పత్రికల్లో ఇందుకు తగ్గ వార్తలు వచ్చి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ దృష్ట్యా, ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై, ఇందులో ఆ ఇద్దరు నేతల ప్రమేయంపై విచారణ కమిషన్ ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విన్నవిం చారు. ఈ పిటిషన్ విచారణ సోమవారం న్యాయమూర్తి సుందరేషన్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు వచ్చింది.


పిటిషనర్, న్యాయవాది బాలసుబ్రమణ్యన్ హా జరై తన వాదనను విన్పించారు. ఆయన వాదనతో కోర్టు ఏకీభవించ లేదు. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా అవినీతి జరిగినట్టు, నిరూపితమైనట్టుగా విచారణ కమిషన్ వేయమని కోరడాన్ని తప్పుబట్టారు. ఆధారాలు ఉంటే చెప్పం డి, విచారణ కొనసాగిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు. అన్నాడీఎంకే వాళ్లు చెబుతున్నారు, ఓ మంత్రి కూ డా అవినీతి అంటున్నారు. వాళ్ల మీద కేసులు వేయొ చ్చుగా అంటూ పిటిషనర్‌కు చురకలు అంటించారు. ఆధారాలు ఉంటే, ఆదేశాలు ఇవ్వగలం, పత్రికల్లో వచ్చిన వార్తను ఆధారంగా చేసుకుని దాఖలు చేసిన ఈ పిటిషన్ విచారణను తొసి పుచ్చుతున్నట్టు ప్రకటించారు.




అన్బుమణికి ఊరట: పీఎంకే మహానాడు సందర్భంగా గతంలో మరక్కణంలో అల్లర్లు బయల్దేరిన విష యం తెలిసిందే. ఈ కేసులో పీఎంకే అధినేత రాందాసు అరెస్టును ఖండిస్తూ యువజన నేత అన్బుమణి రాందాసు నేతృత్వంలో భారీ నిరసన అప్పట్లో సాగింది. ఈ నిరసనకు వ్యతిరేకంగా పోలీసులు కేసు నమోదు చేసి ఉన్నారు. దిండివనం కోర్టులో విచారణ సాగుతోంది. దీనికి అడ్డుకట్ట వేయాలని కోరుతూ అన్బుమణి హైకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి సుబ్బయ్య నేతృత్వంలోని బెంచ్ విచారణపై స్టే విధించారు.




 

Read also in:
Back to Top