'వాళ్లకు ఇచ్చినా బీసీలకు నష్టం లేదు'

'వాళ్లకు ఇచ్చినా బీసీలకు నష్టం లేదు' - Sakshi


విజయవాడ : అమరావతిలో లంక గ్రామాల భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడలో కేఈ కృష్ణమూర్తి విలేకర్లతో మాట్లాడుతూ... రిజిస్ట్రేషన్ శాఖలోని సేవలను సులభతరం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.


ఇప్పటికే ఎన్నారై రిజిస్ట్రేషన్లను సులభతరం చేశామని తెలిపారు. రూ. వెయ్యిపైన స్టాంపుల కొనుగోలు ఆన్లైన్లో కొనుగోలు చేసుకోవచ్చని చెప్పారు. రిజిస్ట్రేషన్ శాఖలో రూ. 3500 కోట్ల లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కేఈ కృష్ణమూర్తి వెల్లడించారు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చినా బీసీలకు నష్టం లేదని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.




 

Read also in:
Back to Top