ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో జన్మభూమిల కమిటీల ఏర్పాటు సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. అర్హులైన లబ్థి దారులకు పింఛన్ తొలగించడంపై దాఖలైన పిటిషన్ ను శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రజాసామ్యబద్దంగా ఎన్నికైన సర్పంచ్ లను పక్కకు పెట్టడమేంటని న్యాయస్థానం సీరియస్ అయింది. మరో వైపు సెక్రటరీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. అదేవిధంగా అర్హులైన 348 లబ్ధి దారులకు మే 1 వతేదీ లోపల మంజూరు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.



 

Read also in:
Back to Top