ఏం చర్యలు తీసుకొంటున్నారు

ఏం చర్యలు తీసుకొంటున్నారు - Sakshi


విదేశాల్లో మన బాధిత మహిళల అంశంపై హైకోర్టు ప్రశ్న

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌లో వివాహం చేసుకుని విదేశాలకు వెళ్లి, అక్కడ విడాకుల బాధితులుగా మారుతున్న మహిళలకు న్యాయ సాయం అందించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం కేంద్రంతో పాటు ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను జూన్‌కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.



స్వదేశంలో పెళ్లిళ్లు చేసుకున్న వారు విదేశాలకు వెళ్లిన తరువాత తమ భార్యలకు విడాకులు ఇస్తున్నారని, దీంతో ఆ దేశాల్లో సదరు మహిళలకు న్యాయసాయం అందడం లేదంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన పైడా అర్చన హైకోర్టులో పిల్‌ను  దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం పై మంగళవారం ఏసీజే నేతృత్వం లోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్‌ వాదనలు వినిపిస్తూ, విదేశాల్లోని విడాకుల బాధిత మహిళలకు న్యాయ సాయం అందించే విషయంలో ఇంటర్‌ మినిస్టీరియల్‌ కమిటీ సిఫారసులు అమలు కావడం లేదన్నారు.




 

Read also in:
Back to Top