మధ్యప్రదేశ్ మాజీ మంత్రి మృతి

జగన్నాథ్ సింగ్ పార్థివదేహానికి నివాళులు అర్పిస్తున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ (ఇన్సెట్: జగన్నాథ్ సింగ్ (ఫైల - Sakshi


భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ మంత్రి జగన్నాథ్ సింగ్ (69) సోమవారం మృతిచెందారు. కొద్ది కాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన భోపాల్ లోని బన్సల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ మద్యాహ్నం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.



2008- 2013 మధ్య మంత్రిగా జగన్నాథ్ పనిచేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మధ్యప్రదేశ్ లోని సభా లోక్సభ స్థానం నుంచి ఎన్నికైయ్యారు. ఒక మారు రాజ్యసభ సభ్యుడిగానూ వ్యవహరించారు. కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం జగన్నాథ్ భౌతికకాయాన్ని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. జగన్నాథ్ సింగ్ కు నివాళులు అర్పించారు. సింగ్రౌలీ జిల్లాలోని స్వగ్రామం చిత్రాంగిలో ఈ రోజు సాయంత్రం జగన్నాథ్ అంత్యక్రియలు జరిగే అవకాశముంది.




 

Read also in:
Back to Top