నకిలీ వైద్యుడి అరెస్ట్
హైదరాబాద్: వైద్య విద్య చదవకుండానే తాను ఎంబీబీఎస్ డాక్టర్‌నంటూ చికిత్సలు చేస్తున్న ఓ వ్యక్తిని అంబర్‌పేట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బతుకమ్మ కుంటలో జె.సుందర్‌రామ్ అనే ఎంబీబీఎస్ వైద్యుని వద్ద అదే ప్రాంతానికి చెందిన శ్రీధర్ (32) ఎనిమిదేళ్లుగా సహయకునిగా పని చేశాడు.
బతుకమ్మకుంటలో సాయిరాం క్లినిక్ పేరిట శ్రీధర్ చికిత్సలు నిర్వహిస్తుండడంతో... డాక్టర్ సుందర్‌రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని శ్రీధర్‌ను అరెస్టు చేశారు.