పుష్కర తొక్కిసలాటపై విచారణ 28కి వాయిదా

పుష్కర తొక్కిసలాటపై విచారణ 28కి వాయిదా


29 మందిని బలిగొన్న దుర్ఘటనపై ఆధారాలు సమర్పించని ప్రభుత్వం

మరో రెండు వారాల గడువు అడిగిన ప్రభుత్వ న్యాయవాది

ఈ నెల 29తో ముగియనున్న ఏకసభ్య కమిషన్ కాలపరిమితి




రాజమహేంద్రవరం క్రైం(తూర్పుగోదావరి జిల్లా) : గత ఏడాది పుష్కరాల తొలిరోజున తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటపై ఏర్పాటు చేసిన జస్టిస్ సోమయాజులు ఏకసభ్య కమిషన్ విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది. గురువారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో బహిరంగ విచారణ నిర్వహించిన కమిషన్ కొద్దిసేపటికే వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ శాఖలు ఒకచోట లేనందున ఆధారాలు లేవని, వాటిని సమర్పించేందుకు మరో రెండు వారాల గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది చింతపెంట ప్రభాకరరావు కోరడంతో కమిషన్ ఈ నెల 28 లోపు ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న ఆధారాలు సమర్పించాలని, లేకుంటే సమన్లు జారీ చేయూల్సి వస్తుందని పేర్కొంది.



ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభించిన కమిషన్ కేవలం 23 నిమిషాలు ప్రభుత్వ న్యాయవాది వాదనలు మాత్రమే విని వెంటనే 28కి వాయిదా వేసింది. ఈ విచారణలో కమిషన్‌కు సహాయకుడిగా ప్రముఖ న్యాయవాది మద్దూరి శివ సుబ్బారావు వ్యవహరించగా ప్రముఖ న్యాయవాది, బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ళ సుబ్బారావు, వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్ బొంతా శ్రీహరి, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు టి.అరుణ్, న్యాయవాది శ్రీనివాస్ తదితరులు హాజరయూరు.





పలు అనుమానాలు...

కమిషన్ కాలపరిమితి ఈ నెల 29తో పూర్తి కానుంది. కమిషన్‌కు మొదట్లో కలెక్టర్ నివేదిక సమర్పించినప్పుడు అన్ని ఆధారాలూ తమ వద్ద ఉన్నాయని, ఎప్పుడు సమర్పించమంటే అప్పుడు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అలాంటిది 29తో కమిషన్ కాలపరిమితి ముగియనుండగా ఏ విధమైన ఆధారాలు లేవ ంటూ మరో రెండు వారాల గడువు కోరడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే గడువులు కోరుతూ వాయిదాలు వేరుుస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 29 మంది ప్రాణాలు కోల్పోరుున ఆ దుర్ఘటన జరిగి ఏడాది కావస్తున్నా, కమిషన్ ఏర్పాటు చేసి తొమ్మిది నెలలైనా ఎందుకీ జాప్యమనే విమర్శలు వినిపిస్తున్నారుు.




 

Read also in:
Back to Top