రిజర్వేషన్ల కోసం టవరెక్కిన బీటెక్ విద్యార్థి


కులంతో సంబంధం లేకుండా.. ఆర్థికంగా వెనుకబడిన వాళ్లకు రిజర్వేషన్లు కేటాయించాలని కోరుతూ.. ఓ ఇంజనీరింగ్ విద్యార్థి సెల్‌టవర్ ఎక్కాడు. కులాల పట్టింపు లేకుండా.. పేద కుటుంబాల పిల్లలకు, గ్రామాలలో పెరిగిన పిల్లలకు ప్రవేశ పరిక్షల్లో 10 శాతం బోనస్ మార్కులను ఇవ్వాలని కోరుతూ కొందరు విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.


విజయవాడలోని ఏలూరు రోడ్డులోని గుణదల సమీపంలో సెల్‌ఫోన్ టవర్ ఎక్కిన రవితేజ అనే బీటెక్ విద్యార్థి అక్కడి నుంచి దూకుతానని బెదిరిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతన్ని నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అతనికి మద్దతుగా ఫ్లెక్సీలతో ప్రదర్శనలు చేపడుతున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కాగా..  ఎమ్మెల్యే  గద్దె రామ్మోహన్ జోక్యం చేసుకోవడంతో.. రవితేజ.. టవర్ దిగేందుకు అంగీకరించాడు.






 




 

Read also in:
Back to Top