ఆగస్టు 31 లేదా సెప్టెంబర్ 3 నుంచి అసెంబ్లీ


సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 31వ తేదీ నుంచి లేదా సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సెప్టెంబర్ 20వ తేదీలోపు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉందని ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. సచివాలయంలో బుధవారం తనను కలిసిన విలేకరులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు.



శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సెప్టెంబర్ రెండో వారంలో విదేశీ పర్యటనకు వెళ్తున్నందున సెప్టెంబర్ తొలి వారంలోనే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఉండవచ్చునని యనమల పేర్కొన్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో రైతుల రుణ మాఫీ, రైతుల ఆత్మహత్యలతో పాటు ఇటీవల పుష్కరాల ప్రారంభం రోజున తొక్కిసలాటలో 29 మంది మృతి చెందిన ఘటన చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

 

డీజిల్ లీటర్‌పై రూ.2 తగ్గింపు:

డీజిల్ ధ రను లీటర్‌పై 2 రూపాయలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు యనమల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ లీటర్‌పై నాలుగు రూపాయల వ్యాట్‌ను పెంచిన విషయం తెలిసిందే.




 

Read also in:
Back to Top