'చిత్తూరు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'


చిత్తూరు : భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ సిద్దార్థ్ జైన్ మంగళవారం చిత్తూరులో సూచించారు. పీఆర్ కండ్రిగ, నేచనూరు వద్ద నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయని తెలిపారు. జిల్లాలో ఎక్కడ ఎటువంటి విపత్తు సంభవించిన సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్దంగా ఉంచినట్లు చెప్పారు.


అలాగే సహాయక చర్యల కోసం రేణిగుంట విమానాశ్రయంలో హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచామన్నారు. జిల్లాలోని నాగులాపురం, విజయపురం, తొట్టంబేడు మండలాల్లో కొన్ని గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని సిద్దార్థ్ జైన్ చెప్పారు.




 

Read also in:
Back to Top